4, జనవరి 2012, బుధవారం

విడి సరులు

డిశెంబరు, 2001 లొ జరిగిన నా సప్తతి ఉత్సవాలలో, సాయంత్రం టీ విరామంలొ, ఒక పూర్వ విద్యార్థి నన్ను, "మీకు జియోఫిజిక్స్ అంటే మక్కువ ఎక్కువా. లేక తెలుగు పద్య సాహిత్యం పైనా" అని అడిగాడు. ఆనాటి సాయంత్రం సభలొ ఉత్సవాలకు నా స్ఫందన చెబుతూ, పై ప్రశ్న గుర్తుకు వచ్చి ఈ క్రింది పద్యం చెప్పాను. ఈ పద్యం, సందర్భం "సాహితీ కౌముది"లో ప్రచురించ బడ్డాయి.

కం. గంగా పార్వతియా, యన
గంగాధరుడేమి చెప్పు - కంగారవడే,
సాంగత్యంబుకు గంగయు
సాంగోపాంగంబు గౌరి - సమతుల్యంబై.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి