ఇతర లింకులు


ఆర్యా! బాగున్నారా?
మర్యాదలమోఘమయ్య. మహిమాన్వితమౌ
చర్యలకుపక్రమించిరి
ధుర్యులు మీరగుచు శుభమతుల్ మిము మెచ్చన్. 

పద్య కవితలోన పారమంటిరి మీరు. 
హృద్య భాషణమున నాద్యులీరు.
సద్యశంబు కూర్చి సరస సద్భాషగా 
తెలుగునుడిని నిలిపి వెలుగుదీరు.

కంద గీత గర్భ చంపక మాల.: 
నిజ రమణీయతన్ శుభము నిక్కము తెల్గుకు చూచుచుండగా. 
ప్రజ కొలుచున్ మదిన్ తెలుగు భాషణ మెల్లెడ తీపులీనుచున్
స్వజన మనోన్నతిన్ భువిని సత్యము చూపుచు పూజ్యమౌను. తా
నజ సఖియేకదా! వినుమయా! నిజ మిద్దియె. వేము భీమధీ!

రమణీయతన్ శుభము ని
క్కము తెల్గుకు చూచుచుండగా, ప్రజ కొలుచున్
నమనోన్నతిన్ భువిని స
త్యము చూపుచు పూజ్యమౌను. తానజ సఖియే.  

శుభము నిక్కము తెల్గుకు చూచుచుండ
తెలుగు భాషణ మెల్లెడ తీపులీను
భువిని సత్యము చూపుచు పూజ్యమౌను. 
వినుమయా! నిజ మిద్దియె. వేము భీమ.


భవదీయుఁడు
రామ కృష్ణా రావు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి