రచన: శ్రీమతి వేము లక్ష్మీకాంతమ్మగారు
సీ. సింహనాదము విని చెంత నున్నటి గిత్త
శరణన్న చందాన చేరి కొలువ,
వ్యాఘ్రచర్మము గప్ప వైరమున్ దలచు నా
హరిణికి అభయ మిచ్చు రీతి దనర,
శిఖి నిస్వనంబుచే చిలువలు భయముతో
జిహ్వలు చెదరంగ జేరి యాడ,
భుజగముల్ బుసగొట్ట భూరి విభ్రాంతిమై
ఒకప్రక్క మూషిక మొదిగి యుండ
ఆ.వె. భూతముల గాంచి భయపడు పార్వతి
కర్థదేహమిచ్చి యాదరించు
చంద్రమౌళి యిచ్చు సౌభాగ్యముల్ మాకు
శౌరి సుతను గూడి శాశ్వతముగ.
(ఈ పద్యము సుమారు 1920-25 మధ్యకాలంలో తమ ఇంట్లోకి వచ్చిన శివుడు, పరివారం చిత్రపటము
చూచి మా ఆమ్మగారైన వేము లక్ష్మీకాంతమ్మగారు [భారతాల సీతగారి నాయనమ్మగారు] రచించినది)
పంపినవారు: ఆచార్య వి. యెల్. యెస్. భీమశంకరం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి