రచన: ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం.
భుజంగప్రయాత వృత్తమాలిక:
భుజంగంబులే హారముల్ భూతసంఘం
బు జంగంబులున్ పంచ భూతంబులున్ పై
తృజాలంబులున్ నాట్యబృందంబులై శై
లజార్ధంబుతో నీవు లంఘింపగా అ
ర్ధజైవాత్రకుం డాడ ధింధిక్క ధింధి
క్క జాళ్వాల మద్దెళ్ళు కంపింపగన్ వి
ష్ణుజా ధారలన్ ధాత్రి శోబిల్ల; జేజే
లజుండున్ ఘనశ్యామలాంగుండు సప్త
ర్షి జంభారి సంఘంబు సేవింప నంద
శు జోహారు భృంగీశు స్తోత్రంబు స్కంధే
శు జేజేలు విఘ్నేశు శుండాల సౌస్వ
ర్య జాత్యంపు ఘీంకార మాకాశ సీమం
దు జృంభింప సంసార దుఃఖఘ్న! శ్రీశై
ల జామాత! నీ నాట్య లాస్యంబు శ్రీశై
లజా మాత క్రీగంట లక్షించుచో అం
గజానంద శృంగార కంజాక్షి యయ్యెన్;
ప్రజాక్షేమ మోదంబు ప్రాప్తించె - భూమా
త జంజాటముల్ మాన్పి ధర్తింపుమో దే
వ! జోబిళ్ళు సేతున్! శివా! కృత్తివాసా!
అజస్రంబు నీ నామ మానంద కందం
బు జన్మంబు ధన్యంబు పూర్ణంబు గాగా
సజావై మనో నేత్ర సంయోగమౌ న
ట్లు జోజో వరంబిమ్ము లోకేశ! ఈశా!
అజేయా! మహేశా! మహా దేవ దేవా!
స్రగ్విణీ గర్భిత భుజంగప్రయాత వృత్తం:
నమో దేవ దేవా! ఘనా దీనబంధూ!
మమున్ కావ రావా! సమగ్ర ప్రభావా!
తమిశ్రా వినాశా! సదా శాంతి దాతా!
సమజ్ఞా వదాన్యా! అసాధ్య ప్రదానా!
(ఈ ఖండిక రచయిత విరచిత "రసస్రువు" కావ్యము లోనిది.)
సిలికానాంధ్ర వారి July, 2012 సుజనరంజని e-magazine పద్యం-హ్రిద్యం శీర్షికలొ ప్రచురితము.
భుజంగప్రయాత వృత్తమాలిక:
భుజంగంబులే హారముల్ భూతసంఘం
బు జంగంబులున్ పంచ భూతంబులున్ పై
తృజాలంబులున్ నాట్యబృందంబులై శై
లజార్ధంబుతో నీవు లంఘింపగా అ
ర్ధజైవాత్రకుం డాడ ధింధిక్క ధింధి
క్క జాళ్వాల మద్దెళ్ళు కంపింపగన్ వి
ష్ణుజా ధారలన్ ధాత్రి శోబిల్ల; జేజే
లజుండున్ ఘనశ్యామలాంగుండు సప్త
ర్షి జంభారి సంఘంబు సేవింప నంద
శు జోహారు భృంగీశు స్తోత్రంబు స్కంధే
శు జేజేలు విఘ్నేశు శుండాల సౌస్వ
ర్య జాత్యంపు ఘీంకార మాకాశ సీమం
దు జృంభింప సంసార దుఃఖఘ్న! శ్రీశై
ల జామాత! నీ నాట్య లాస్యంబు శ్రీశై
లజా మాత క్రీగంట లక్షించుచో అం
గజానంద శృంగార కంజాక్షి యయ్యెన్;
ప్రజాక్షేమ మోదంబు ప్రాప్తించె - భూమా
త జంజాటముల్ మాన్పి ధర్తింపుమో దే
వ! జోబిళ్ళు సేతున్! శివా! కృత్తివాసా!
అజస్రంబు నీ నామ మానంద కందం
బు జన్మంబు ధన్యంబు పూర్ణంబు గాగా
సజావై మనో నేత్ర సంయోగమౌ న
ట్లు జోజో వరంబిమ్ము లోకేశ! ఈశా!
అజేయా! మహేశా! మహా దేవ దేవా!
స్రగ్విణీ గర్భిత భుజంగప్రయాత వృత్తం:
నమో దేవ దేవా! ఘనా దీనబంధూ!
మమున్ కావ రావా! సమగ్ర ప్రభావా!
తమిశ్రా వినాశా! సదా శాంతి దాతా!
సమజ్ఞా వదాన్యా! అసాధ్య ప్రదానా!
(ఈ ఖండిక రచయిత విరచిత "రసస్రువు" కావ్యము లోనిది.)
సిలికానాంధ్ర వారి July, 2012 సుజనరంజని e-magazine పద్యం-హ్రిద్యం శీర్షికలొ ప్రచురితము.
చిదానంద ఓ భీమ శ్రీ శంకరా మీ
రిప్లయితొలగించండిమదిన్ బుట్టి సద్గణ్య మార్గంబులో నా
శు ధారా సుధా ధార చూడంగనే నా
మది న్సంతసంబయ్యె మాన్యా! కవీంద్రా!