భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.
(పదవ విడత)
91. కొలది వాని నీవు కొలువులో నుంచిన,
వేతనమ్మె కాదు ‘వేష్టు’ ఖర్చు
చేత గాక వాడు చెఱచును పనులన్ని,
విమల సుగుణ ధామ వేము భీమ.
92. ఉన్నతాధికారి ఉత్సాహి గానిచో,
క్రింది వారు స్ఫూర్తి జెంద రెపుడు -
సేన నడువ బోదు సేనాని నిద్రింప!
విమల సుగుణ ధామ వేము భీమ.
93. అలతి మనుజు లెన్న అధికారులై యున్న,
దేశవృద్ధి పైన దృష్టి సున్న -
ఆశయంబు కన్న”యామ్యాము” లే మిన్న!
విమల సుగుణ ధామ వేము భీమ.
94. ఊబ జనుడు పెద్ద యుద్యోగి యైనచో,
దేశ మమ్మి వేయు కాసు కొఱకు,
ప్రతిభ లేని వాడు కతక కుండగ లేడు -
విమల సుగుణ ధామ వేము భీమ.
95. శత్రు దాడి నుండి చతురత దేశంబు
కాచు కొనగ వచ్చు కలత లేదు,
కలుష రాజకీయ ఖామందులే ముప్పు -
విమల సుగుణ ధామ వేము భీమ.
96. ప్రజల ప్రతినిధి యన - నిజముగా నీ నాడు
ప్రజల ప్రతి నిధియును రంజు గాను
తనదటంచు తలచి దాని తినెడు వాడె -
విమల సుగుణ ధామ వేము భీమ.
97. రాజకీయ వేత్త రమ్యంబుగా నేడు
నటనమాడు జనుల నమ్మ జేయ -
వారు మూర్ఖు లనుచు వాని నమ్మక మేమొ!
విమల సుగుణ ధామ వేము భీమ.
98. పెద్ద ‘ఫిల్ము స్టారు’ ‘ఫ్రీ రోడ్డు షో’ లివ్వ ,
వాని జూడ జనులు వచ్చి నాను,
ఓటు నిత్తురన్న మాటుత్తిదే సుమ్ము!
విమల సుగుణ ధామ వేము భీమ.
99. ఓటు వేయమన్న మాట చాలదు నేడు,
మాట తోడ పెద్ద మూట నిచ్చి,
కల్ల బొల్లి ఆశ కల్పింపగావలె -
విమల సుగుణ ధామ వేము భీమ.
100. నోరు తెరచి సీత కోరలే దెన్నండు,
అడవి లోని భర్మ హరిణి దక్క,
దాని వలన నయ్యె దానవ నాశంబు -
విమల సుగుణ ధామ వేము భీమ.
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.
(పదవ విడత)
91. కొలది వాని నీవు కొలువులో నుంచిన,
వేతనమ్మె కాదు ‘వేష్టు’ ఖర్చు
చేత గాక వాడు చెఱచును పనులన్ని,
విమల సుగుణ ధామ వేము భీమ.
92. ఉన్నతాధికారి ఉత్సాహి గానిచో,
క్రింది వారు స్ఫూర్తి జెంద రెపుడు -
సేన నడువ బోదు సేనాని నిద్రింప!
విమల సుగుణ ధామ వేము భీమ.
93. అలతి మనుజు లెన్న అధికారులై యున్న,
దేశవృద్ధి పైన దృష్టి సున్న -
ఆశయంబు కన్న”యామ్యాము” లే మిన్న!
విమల సుగుణ ధామ వేము భీమ.
94. ఊబ జనుడు పెద్ద యుద్యోగి యైనచో,
దేశ మమ్మి వేయు కాసు కొఱకు,
ప్రతిభ లేని వాడు కతక కుండగ లేడు -
విమల సుగుణ ధామ వేము భీమ.
95. శత్రు దాడి నుండి చతురత దేశంబు
కాచు కొనగ వచ్చు కలత లేదు,
కలుష రాజకీయ ఖామందులే ముప్పు -
విమల సుగుణ ధామ వేము భీమ.
96. ప్రజల ప్రతినిధి యన - నిజముగా నీ నాడు
ప్రజల ప్రతి నిధియును రంజు గాను
తనదటంచు తలచి దాని తినెడు వాడె -
విమల సుగుణ ధామ వేము భీమ.
97. రాజకీయ వేత్త రమ్యంబుగా నేడు
నటనమాడు జనుల నమ్మ జేయ -
వారు మూర్ఖు లనుచు వాని నమ్మక మేమొ!
విమల సుగుణ ధామ వేము భీమ.
98. పెద్ద ‘ఫిల్ము స్టారు’ ‘ఫ్రీ రోడ్డు షో’ లివ్వ ,
వాని జూడ జనులు వచ్చి నాను,
ఓటు నిత్తురన్న మాటుత్తిదే సుమ్ము!
విమల సుగుణ ధామ వేము భీమ.
99. ఓటు వేయమన్న మాట చాలదు నేడు,
మాట తోడ పెద్ద మూట నిచ్చి,
కల్ల బొల్లి ఆశ కల్పింపగావలె -
విమల సుగుణ ధామ వేము భీమ.
100. నోరు తెరచి సీత కోరలే దెన్నండు,
అడవి లోని భర్మ హరిణి దక్క,
దాని వలన నయ్యె దానవ నాశంబు -
విమల సుగుణ ధామ వేము భీమ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి