భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.
(పదకొండవ విడత)
101. బ్రదుకు క్రీడ యనెడు చదరంగ మందున
నీవె రాజు - కాని నీ మనుగడ
నిర్ణయించు వారు నీ చుట్టు బలగాలె!
విమల సుగుణ ధామ వేము భీమ.
102. ఎఱిగి నట్టి వారి నించుక వెను దట్టు,
అందు మంచి వారి నాదరించు,
ఎన్నడైన గాని హింసించ కెవరినీ -
విమల సుగుణ ధామ వేము భీమ.
103. తరతరాల కొఱకు ధనము గణించుటే
రాజకీయ వేత్త లక్ష్య మెపుడు,
సంతతికి స్వశక్తి సుంతైన లేకనే!
విమల సుగుణ ధామ వేము భీమ.
104. చదువు లేని వాడు చదువుల మంత్రైన,
గొప్ప కొఱకు మార్చు ‘కోర్సు’ లెల్ల,
తెలియు దీని ఫలము కొన్ని ఏండ్లైనాక -
విమల సుగుణ ధామ వేము భీమ.
105. కట్నమను పిశాచి కాల వ్రాయ వలయు
ననుచు సభలలోన నఱచు వారె
లాంఛనాల పేర లక్షల గొందురు -
విమల సుగుణ ధామ వేము భీమ.
106. అంటరానితనము వెంటనే మాన్పించ
వలె నటంచు చెప్పు ప్రజలలోన,
వారి వియ్యమందు వారెందరున్నారు?
విమల సుగుణ ధామ వేము భీమ.
107. పౌర హక్కులకై ప్రతి పౌరు డీనాడు
గొంతు చించు కొనుచు గెంతు గాని
పౌర బాధ్యతలను పట్టించు కోడేల!
విమల సుగుణ ధామ వేము భీమ.
108. పాలు చేపనట్టి బర్రె, పండని చేను,
లంచగొండి భటులు, రాని విద్య,
రక్షణివ్వలేని రాజ్యంబు వీడుము -
విమల సుగుణ ధామ వేము భీమ.
109. బ్రదుకునందు జరుగు ప్రతి సంఘటన గూడ,
మంచి దనుచు స్వాగతించ వలయు,
పుడమిలోన నిదియె ‘పోజిటివ్ థింకింగు’ -
విమల సుగుణ ధామ వేము భీమ.
110. ఇల్లు కలదు నాకి కే బెంగ లేదను
వాడె ‘ఆప్టిమిస్టు’, వసతి తప్ప
ఏమి లేదను నత డిలలోన ‘పెసిమిస్టు’ -
విమల సుగుణ ధామ వేము భీమ.
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.
(పదకొండవ విడత)
101. బ్రదుకు క్రీడ యనెడు చదరంగ మందున
నీవె రాజు - కాని నీ మనుగడ
నిర్ణయించు వారు నీ చుట్టు బలగాలె!
విమల సుగుణ ధామ వేము భీమ.
102. ఎఱిగి నట్టి వారి నించుక వెను దట్టు,
అందు మంచి వారి నాదరించు,
ఎన్నడైన గాని హింసించ కెవరినీ -
విమల సుగుణ ధామ వేము భీమ.
103. తరతరాల కొఱకు ధనము గణించుటే
రాజకీయ వేత్త లక్ష్య మెపుడు,
సంతతికి స్వశక్తి సుంతైన లేకనే!
విమల సుగుణ ధామ వేము భీమ.
104. చదువు లేని వాడు చదువుల మంత్రైన,
గొప్ప కొఱకు మార్చు ‘కోర్సు’ లెల్ల,
తెలియు దీని ఫలము కొన్ని ఏండ్లైనాక -
విమల సుగుణ ధామ వేము భీమ.
105. కట్నమను పిశాచి కాల వ్రాయ వలయు
ననుచు సభలలోన నఱచు వారె
లాంఛనాల పేర లక్షల గొందురు -
విమల సుగుణ ధామ వేము భీమ.
106. అంటరానితనము వెంటనే మాన్పించ
వలె నటంచు చెప్పు ప్రజలలోన,
వారి వియ్యమందు వారెందరున్నారు?
విమల సుగుణ ధామ వేము భీమ.
107. పౌర హక్కులకై ప్రతి పౌరు డీనాడు
గొంతు చించు కొనుచు గెంతు గాని
పౌర బాధ్యతలను పట్టించు కోడేల!
విమల సుగుణ ధామ వేము భీమ.
108. పాలు చేపనట్టి బర్రె, పండని చేను,
లంచగొండి భటులు, రాని విద్య,
రక్షణివ్వలేని రాజ్యంబు వీడుము -
విమల సుగుణ ధామ వేము భీమ.
109. బ్రదుకునందు జరుగు ప్రతి సంఘటన గూడ,
మంచి దనుచు స్వాగతించ వలయు,
పుడమిలోన నిదియె ‘పోజిటివ్ థింకింగు’ -
విమల సుగుణ ధామ వేము భీమ.
110. ఇల్లు కలదు నాకి కే బెంగ లేదను
వాడె ‘ఆప్టిమిస్టు’, వసతి తప్ప
ఏమి లేదను నత డిలలోన ‘పెసిమిస్టు’ -
విమల సుగుణ ధామ వేము భీమ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి