భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.
(పన్నెండవ విడత)
111. కడుపు నిండ తిండి కలవారి కే రీతి
వెలితి కడుపు బాధ తెలియ గలదు?
తిండి పెట్టకుండ ఎండ గట్టిన గాని!
విమల సుగుణ ధామ వేము భీమ.
112. ధనికులైన వారి ధర్మ సూత్రంబులు,
కొలది వారి కెపుడు కుదుర బోవు -
కడుపు కాలినపుడు కలుగునే ధర్మంబు?
విమల సుగుణ ధామ వేము భీమ.
113. “ఆకలయ్యె నాకు, అన్నంబు లేదింట”
నన్న పేదతోడ ననియె రాణి,
“అయిన తినుమిక పరమాన్నంబు, పులిహొర”
విమల సుగుణ ధామ వేము భీమ.
114. కల యనంగ నిద్ర కనబడినది కాదు -
నీకు నిద్ర పట్ట నీయ నట్టి
ఆశయమ్ము గాని అవనిలో తలబోయ!
విమల సుగుణ ధామ వేము భీమ.
115. ఆత్మ శుద్ధితోడ అర్థించి వేడంగ,
నీవు నమ్మినట్టి దేవు డెపుడు,
చెంత చేరి నీకు చింతలు దీర్చును,
విమల సుగుణ ధామ వేము భీమ.
116. బలిమి యున్న గాని, కలిమి యున్నను గాని,
బంధు వర్గమున్న వైద్యులున్న,
ఆపగలమె మిత్తి అర్థ నిమేష మైన -
విమల సుగుణ ధామ వేము భీమ.
117. కోర్కు లున్న యెడల కోట్లు రావచ్చును -
అర్థ కామ వృత్తు లణచు కొన్న
ధర్మ మోక్ష ఫలము దర్శనంబగు రూఢి!
విమల సుగుణ ధామ వేము భీమ.
118. బ్రదుకు గాథలోని రాబోవు పేజీలు
చదువ వీలు గాక చెదిరి యుండు -
ఇదియె మంచిదేమొ ఎంచి చూడంగను!
విమల సుగుణ ధామ వేము భీమ.
119. ‘చెక్కు’ వ్రాసినంత చిక్కునే పైకంబు,
‘బ్యాంకెకౌంటు’ నందు ‘క్యాషు’ లేక -
పొందగలమె సుఖము పూర్వ పుణ్యము లేక?
విమల సుగుణ ధామ వేము భీమ.
120. నేను కలను గంటి నృపతి నైనట్లుగా
లేచి చూడ చుట్టు లేమి నవ్వె -
సత్యమెద్ది తలప స్వప్నమా, మెలకువా!
విమల సుగుణ ధామ వేము భీమ.
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.
(పన్నెండవ విడత)
111. కడుపు నిండ తిండి కలవారి కే రీతి
వెలితి కడుపు బాధ తెలియ గలదు?
తిండి పెట్టకుండ ఎండ గట్టిన గాని!
విమల సుగుణ ధామ వేము భీమ.
112. ధనికులైన వారి ధర్మ సూత్రంబులు,
కొలది వారి కెపుడు కుదుర బోవు -
కడుపు కాలినపుడు కలుగునే ధర్మంబు?
విమల సుగుణ ధామ వేము భీమ.
113. “ఆకలయ్యె నాకు, అన్నంబు లేదింట”
నన్న పేదతోడ ననియె రాణి,
“అయిన తినుమిక పరమాన్నంబు, పులిహొర”
విమల సుగుణ ధామ వేము భీమ.
114. కల యనంగ నిద్ర కనబడినది కాదు -
నీకు నిద్ర పట్ట నీయ నట్టి
ఆశయమ్ము గాని అవనిలో తలబోయ!
విమల సుగుణ ధామ వేము భీమ.
115. ఆత్మ శుద్ధితోడ అర్థించి వేడంగ,
నీవు నమ్మినట్టి దేవు డెపుడు,
చెంత చేరి నీకు చింతలు దీర్చును,
విమల సుగుణ ధామ వేము భీమ.
116. బలిమి యున్న గాని, కలిమి యున్నను గాని,
బంధు వర్గమున్న వైద్యులున్న,
ఆపగలమె మిత్తి అర్థ నిమేష మైన -
విమల సుగుణ ధామ వేము భీమ.
117. కోర్కు లున్న యెడల కోట్లు రావచ్చును -
అర్థ కామ వృత్తు లణచు కొన్న
ధర్మ మోక్ష ఫలము దర్శనంబగు రూఢి!
విమల సుగుణ ధామ వేము భీమ.
118. బ్రదుకు గాథలోని రాబోవు పేజీలు
చదువ వీలు గాక చెదిరి యుండు -
ఇదియె మంచిదేమొ ఎంచి చూడంగను!
విమల సుగుణ ధామ వేము భీమ.
119. ‘చెక్కు’ వ్రాసినంత చిక్కునే పైకంబు,
‘బ్యాంకెకౌంటు’ నందు ‘క్యాషు’ లేక -
పొందగలమె సుఖము పూర్వ పుణ్యము లేక?
విమల సుగుణ ధామ వేము భీమ.
120. నేను కలను గంటి నృపతి నైనట్లుగా
లేచి చూడ చుట్టు లేమి నవ్వె -
సత్యమెద్ది తలప స్వప్నమా, మెలకువా!
విమల సుగుణ ధామ వేము భీమ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి