భీమ శతకం
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.
(పదునాల్గవ విడత)
131. జీవితాన సగటుజీవి చేసెడు తప్పు,
తప్పు చేతు ననెడు తలపు తోడ
బాధ పడుచు సతము బ్రతుకుటే తలబోయ -
విమల సుగుణ ధామ వేము భీమ.
132. భావి కొఱకు నీవు బాధతో కుందుచు,
వర్తమాన మందు బ్రదుక మఱచి,
రెంటికి చెడినట్టి రేవడై పోకుము -
విమల సుగుణ ధామ వేము భీమ.
133. జరిగినవి జరిగెను - చర్చ చేయగ నేల,
జరుగ బోవు నవియు జరుగ వేమొ?
జరుగ నట్టి వాటి కొఱకెందుకో చింత!
విమల సుగుణ ధామ వేము భీమ.
134. ప్రక్క ఇంటి వాని భార్య రూపసి యంచు
పొగడనట్టి భర్త భువిని అరుదు -
పుల్లనైనను రుచి పొరుగింటి గోంగూర!
విమల సుగుణ ధామ వేము భీమ.
135. దూరమందు గిరులు సౌరుగా తోచును,
చెంత కేగ గట్లు గుంత లుండు -
పొరుగువాని భాగ్య భోగ్యంబు లిట్లురా!
విమల సుగుణ ధామ వేము భీమ.
136. పనిని పూర్తి చేయ పట్టి ప్రయత్నించు,
గెలువ నంత మాత్ర తొలగ బోకు,
అదియె మొదటి యత్న మనుకొని సాగరా -
విమల సుగుణ ధామ వేము భీమ.
137. యుద్ధమందు తగులు పెద్ద దెబ్బలు గూడ,
మాసిపోవు కాల మహిమ వలన,
మాసిపోని వెపుడు మనవారి దెప్పులే!
విమల సుగుణ ధామ వేము భీమ.
138. నీరు జలధి నున్న నింగిపై కెగురును
హస్త మందు గొన్న నడగి యుండు -
స్థాన బల్మి గాని తన బల్మి కాదయా!
విమల సుగుణ ధామ వేము భీమ.
139. మంచి జరుగు నాడు మారాజు ననుకోకు,
కీడు జరుగు నపుడు క్లేశ పడకు,
కష్ట సుఖము లెపుడు కావడి కుండలే -
విమల సుగుణ ధామ వేము భీమ.
140. కొన్ని పుస్తకాలు కొని చదువ వలయు,
కొన్ని అరువు తెచ్చి, కొన్ని ‘బుక్సు’
చిత్తగించ బోకు డుత్తినే ఇచ్చినా -
విమల సుగుణ ధామ వేము భీమ.
రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.
(పదునాల్గవ విడత)
131. జీవితాన సగటుజీవి చేసెడు తప్పు,
తప్పు చేతు ననెడు తలపు తోడ
బాధ పడుచు సతము బ్రతుకుటే తలబోయ -
విమల సుగుణ ధామ వేము భీమ.
132. భావి కొఱకు నీవు బాధతో కుందుచు,
వర్తమాన మందు బ్రదుక మఱచి,
రెంటికి చెడినట్టి రేవడై పోకుము -
విమల సుగుణ ధామ వేము భీమ.
133. జరిగినవి జరిగెను - చర్చ చేయగ నేల,
జరుగ బోవు నవియు జరుగ వేమొ?
జరుగ నట్టి వాటి కొఱకెందుకో చింత!
విమల సుగుణ ధామ వేము భీమ.
134. ప్రక్క ఇంటి వాని భార్య రూపసి యంచు
పొగడనట్టి భర్త భువిని అరుదు -
పుల్లనైనను రుచి పొరుగింటి గోంగూర!
విమల సుగుణ ధామ వేము భీమ.
135. దూరమందు గిరులు సౌరుగా తోచును,
చెంత కేగ గట్లు గుంత లుండు -
పొరుగువాని భాగ్య భోగ్యంబు లిట్లురా!
విమల సుగుణ ధామ వేము భీమ.
136. పనిని పూర్తి చేయ పట్టి ప్రయత్నించు,
గెలువ నంత మాత్ర తొలగ బోకు,
అదియె మొదటి యత్న మనుకొని సాగరా -
విమల సుగుణ ధామ వేము భీమ.
137. యుద్ధమందు తగులు పెద్ద దెబ్బలు గూడ,
మాసిపోవు కాల మహిమ వలన,
మాసిపోని వెపుడు మనవారి దెప్పులే!
విమల సుగుణ ధామ వేము భీమ.
138. నీరు జలధి నున్న నింగిపై కెగురును
హస్త మందు గొన్న నడగి యుండు -
స్థాన బల్మి గాని తన బల్మి కాదయా!
విమల సుగుణ ధామ వేము భీమ.
139. మంచి జరుగు నాడు మారాజు ననుకోకు,
కీడు జరుగు నపుడు క్లేశ పడకు,
కష్ట సుఖము లెపుడు కావడి కుండలే -
విమల సుగుణ ధామ వేము భీమ.
140. కొన్ని పుస్తకాలు కొని చదువ వలయు,
కొన్ని అరువు తెచ్చి, కొన్ని ‘బుక్సు’
చిత్తగించ బోకు డుత్తినే ఇచ్చినా -
విమల సుగుణ ధామ వేము భీమ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి